అనంతపురం జిల్లా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ నారాయణ స్వామి ఆదేశాల మేరకు... ఉరవకొండలో వాహనాలను తనిఖీలు చేశారు. జిల్లాలోని విడపనకల్ మండలంలో కర్ణాటక సరిహద్దు వద్ద మద్యాన్ని తరలిస్తున్న వారిని ఎన్ఫోర్స్మేంట్ పోలీసులు, సిబ్బంది పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 960 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. విడపనకల్ మండలం జనార్దనపల్లి గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు, ఉరవకొండకు చెందిన ఒకరు, చాబాలకు చెందిన మరో వ్యక్తిని వారు అరెస్ట్ చేశారు.
ఉరవకొండలో అక్రమ మద్యం స్వాధీనం... నలుగురి అరెస్ట్
అనంతపురం జిల్లా ఉరవకొండలో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు వాహనాలను తనిఖీలు చేశారు. కర్ణాటక నుంచి రాష్ట్రానికి అక్రమంగా తరలిస్తున్న 960మద్యం సీసాలను స్వాధీనం చేసుకుని నలుగురు వ్యక్తులను అరెస్టు చేశారు.
అనంతపురంలో మద్యం స్వాధీనం
ఇదీ చదవండి: