అంతామాయ... సబ్సిడీ విత్తనాల పట్టివేత! - ananthapuram
అక్రమంగా తరలిస్తున్న విత్తనాలను బసాపురం గ్రామస్థులు పట్టుకున్నారు. కర్ణాటకకు తరస్తుండగా... 150 సబ్సిడీ వేరుశెనగ విత్తనాలను ప్రజలు గుర్తించారు.
illegal-seeds
అనంతపురం జిల్లాలో అక్రమంగా తరలిస్తున్న సబ్సిడీ వేరుశెనగ విత్తనాలను రైతులు పట్టుకున్నారు. కర్ణాటకకు తరలిస్తున్న 150 బస్తాల విత్తనాలను కుందుర్పి మండలం బసాపురం గ్రామస్థులు గుర్తించారు. వెంటనే.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. వేరుశనగ బస్తాలు కంబదూరు మండలం నుంచి తరలిస్తున్నారని ప్రజలు తెలిపారు. అక్రమంగా విత్తనాలను తరలిస్తున్న వ్యాపారిని పోలీసులు గుర్తించారు.