అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గంలోని పామిడి సమీపంలో ఇసుకను అక్రమ రవాణాను స్థానికులు అడ్డుకున్నారు. అర్ధరాత్రి ఇసుక తరలిస్తున్న ముఠాను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఇక నుంచి ఇసుక రీచ్‌ల వద్ద సాంకేతిక పరికరాలను అమర్చుతామని అధికారులు తెలిపారు. ఇసుక రీచ్‌ల్లో ఎవరైనా అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ శ్రీనివాసులు హెచ్చరించారు. నిబంధనల ప్రకారం ఉదయం 6 గంటల నుంచి 5 గంటల వరకు మాత్రమే ఇసుక రవాణా జరగాలని... రాత్రివేళలో రవాణా చేస్తే చర్యలు తప్పవని అన్నారు.
అర్ధరాత్రి ఇసుక అక్రమ రవాణా అడ్డుకున్న గ్రామస్థులు - latest news of sand in anantapur
అనంతపురం జిల్లాలో ఇసుక అక్రమరవాణాను స్థానికులు అడ్డుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా రీచ్‌లో అర్ధరాత్రి ఇసుక రవాణా చేసిన వ్యక్తులను పట్టుకుని పోలీసులకు అప్పగించారు.
పామిడి రీచ్‌లో జరిగిన ఇసుక అక్రమ రవాణా
ఇదీ చూడండి: