కర్ణాటక రాష్ట్రం బళ్లారి నుంచి అక్రమంగా మద్యం తరలిస్తున్న ఇద్దరిని అనంతపురం జిల్లా ఉరవకొండ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ సీ.ఐ శ్యాంప్రసాద్.. అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 336 మద్యం ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఉరవకొండ మండలం రాయంపల్లి గ్రామ శివారులో ఓ వ్యక్తి నుంచి 96 ప్యాకెట్లు, ఒక ద్విచక్రవాహనం... విడపనకల్లో మరో వ్యక్తి నుంచి 240 ప్యాకెట్లు, ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. వీరిపై కేసు నమోదు చేసి స్టేషన్కు తరలించారు. అక్రమ మద్యం తరలింపునకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.
కర్ణాటక మద్యం అక్రమ తరలింపు... ఇద్దరు అరెస్ట్ - ఉరవకొండ నేటి వార్తలు
రాష్ట్రంలో మద్యం ధరలు భారీగా పెరగడంతో అక్రమార్కులు నూతన విధానానికి తెరలేపారు. సరిహద్దు రాష్ట్రాల నుంచి గుట్టుచప్పుడు కాకుండా సరకును తరలిస్తూ జేబులు నింపుకుంటున్నారు. కర్ణాటక రాష్ట్రం నుంచి అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని అనంతపురం జిల్లా ఉరవకొండ పోలీసులు పట్టుకున్నారు.
కర్ణాటక మద్యం అక్రమ తరలింపు..ఇద్దరు అరెస్ట్