రాష్ట్రంలో రోజురోజుకు పెరుగుతున్న అక్రమ మద్యం రవాణా అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గంలో పోలీసులు తనీఖీలు చేశారు. కర్ణాటక నుంచి బైక్పై మద్యానికి అక్రమంగా తీసుకువస్తున్న ఇధ్దరిని పోలీసులు అరెస్టు చేశారు. ఆంజనేయులు నాయక్ అనే వ్యక్తి పోలీసుల రాకను గమనించి వాహనం వదలి పరారయ్యాడు. అతని వద్ద నుంచి 90 మద్యం బాటిళ్లు సీజ్ చేశారు. నిందితుడిపై కేసు నమోదు చేసి గాలిస్తున్నారు. మడకశిర నియోజకవర్గానికి కర్ణాటక సరిహద్దు ఉండడంతో అక్కడి నుంచి మద్యం తెచ్చి గ్రామాల్లో విక్రయిస్తున్నారని పోలీసులు తెలిపారు. ఇలాంటి కార్యకలాపాలను ఎవరైనా పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ రాజేంద్రప్రసాద్ హెచ్చరించారు.
గుత్తిలో కర్ణాటక మద్యం పట్టివేత
కర్ణాటక మద్యం అక్రమంగా నిల్వ ఉంచి విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను గుత్తి ఎక్సేంజ్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో పోలీసులు అరెస్టు చేశారు. కర్ణాటక మద్యం అక్రమంగా నిల్వ ఉంచారని పక్కా సమాచారం రావడంతో తమ సిబ్బందితో కలిసి ఈ దాడులు నిర్వహించామని స్థానిక ఎక్సేంజ్ సీఐ సుభాషిని తెలిపారు. అందులో భాగంగానే 20 వేల 738 రూపాయల విలువ చేసే 486 మద్యం సీసాలను సీజ్ చేశామన్నారు.
అదేవిధంగా కడప, చిత్తూరు, ప్రకాశం జిల్లాలో శానిటైజర్ లు తాగి పలువురు మృతి చెందిన నేపథ్యంలో మంగళవారం గుత్తి ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో పోలీసులు పలు మెడికల్ షాపులను తనిఖీలు చేశారు. ఆ దుకాణాల యజమానులతో శానిటైజర్ అమ్మే వ్యక్తి వివరాలను రిజిస్టర్లో నమోదు చేసుకోవాలని సూచించారు. గుత్తి మండలం అబ్బేదొడ్డి గ్రామంలో నాటుసారా అక్రమంగా నిలువ ఉంచిన వ్యక్తిని అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి 10 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు.
ఇవీ చదవండి