ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

భారీగా అక్రమ మద్యం స్వాధీనం.. బెల్లం ఊట ధ్వంసం - illegal liquor sized update

ఇతర రాష్ట్రాల నుంచి అక్రమంగా మద్యం తీసుకువస్తున్న వారిపై.. పోలీసులు చర్యలు తీసుకుంటున్నా, కొందరు అక్రమార్కులు మాత్రం మారటం లేదు. తాజాగా కర్ణాటక నుంచి మద్యాన్ని తీసుకువస్తున్న ఓ వ్యక్తిని అనంతపురం జిల్లా విడపనకల్ పోలీసులు అరెస్టు చేశారు.

illegal liquor sized
అక్రమం మద్యం స్వాధీనం

By

Published : Feb 12, 2021, 2:47 PM IST

అనంతపురం జిల్లాలో..

అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం విడపనకల్ పోలీసులు... కర్ణాటక మద్యాన్ని అక్రమంగా తీసుకువస్తున్న వ్యక్తిని అరెస్టు చేశారు. కర్ణాటక నుంచి అక్రమంగా మద్యాన్ని తీసుకువస్తున్నారన్న సమచారంతో.. విడపనకల్- కర్ణాటక సరిహద్దు వద్ద వాహన తనిఖీలు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు. సోదాల్లో బళ్లారి నుంచి అక్రమంగా తీసుకువస్తున్న.. కర్ణాటక మద్యం పట్టుడిందని వివరించారు. నిందితుడు నుంచి మద్యాన్ని, టెట్రా ప్యాకెట్లను స్వాధీనం చేసుకొని.. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు.

తూర్పు గోదావరి జిల్లాలో..

తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం వెలిచేరులో... నాటుసారా తయారీ కేంద్రాలపై జిల్లా ఎన్ఫోర్స్​మెంట్ బ్యూరో అధికారులు దాడులు చేశారు. గౌతమి గోదావరి ఇసుక దిబ్బల్లో సారా తయారీకి ఉపయోగిస్తున్న... 8,500 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేసినట్లు అధికారులు వివరించారు. 85 డ్రమ్ములను కాల్చివేసినట్లు తెలిపారు.

కొత్తపేటలో నాటుసారా రవాణా చేస్తున్న.. వెంకటరమణ అనే వ్యక్తిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడి నుంచి 15 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకొని... సారా తయారీకి నిల్వ ఉంచిన 80 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేసినట్లు వివరించారు.

కడప జిల్లాలో..

కడప జిల్లా ఓబులవారిపల్లి మండల పరిధిలో... కోడూరు స్పెషల్ ఎన్ఫోర్స్​మెంట్ సిబ్బంది దాడులు నిర్వహించారు. నాటుసారా, బెల్ట్ షాపులు, అక్రమ మద్యం వంటి వాటిని స్వాధీనం చేసుకునేందుకు దాడులు నిర్వహించినట్లు అధికారులు స్పష్టం చేశారు. గొబ్బూరు వారిపల్లి క్రాస్ వద్ద... ప్లాస్టిక్ క్యాన్లలలో తరలిస్తున్న 20 లీటర్ల నాటు సారాను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

ఇదీ చదవండి:శాసన రాజధాని భవనాల కోసం కమిటీ

ABOUT THE AUTHOR

...view details