కర్ణాటక నుండి అక్రమంగా ఏపీలోకి మద్యం తరలించేందుకు అక్రమార్కులు చేసిన ప్రయత్నానికి పోలీసులు చెక్ పెట్టారు. అనంతపురం జిల్లా విడపనకల్ మండలం డోనేకల్ అంతర్రాష్ట్ర సరిహద్దు వద్ద పాల వ్యానులో అక్రమంగా తరలిస్తున్న రూ.10 లక్షల విలువగల మద్యాన్ని సెబ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ముగ్గురు వ్యక్తులు పాల సరఫరా పేరుతో మద్యాన్ని అక్రమంగా తరలిస్తూ పోలీసులకు పట్టుబడ్డారు. కర్నూలు జిల్లా డోన్‌కు చెందిన రాము, చంద్ర, రాజు, శ్రీనిధి పాల సరఫరా పేరుతో వ్యానును ఏర్పాటు చేసుకుని మద్యాన్ని తరలించడానికి వాహనంలో సగభాగాన్ని ప్రత్యేకంగా తయారు చేయించుకున్నారు. మిగతా సగభాగంలో పాల ప్యాకెట్లు ఉంచుతున్నారు.