కర్నూలు, అనంతపురం జిల్లాల్లో పోలీసుల తనిఖీల్లో అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని పట్టుకున్నారు. నిందితులను అరెస్టు చేసి.. మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.
కర్నూలు జిల్లా
కర్నూలు జిల్లా పంచలింగాల చెక్‌పోస్టు వద్ద పోలీసులు చేపట్టిన తనిఖీల్లో అక్రమంగా తరలిస్తున్న 296 మద్యం సీసాలను పట్టుకున్నారు. ఈ ఘటనలో ఓ ఆటో, రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. నలుగురిని అరెస్టు చేశారు. బనగానపల్లి సమీపంలోని గుత్తి రోడ్డులో అక్రమంగా తరలిస్తున్న నాలుగువందల లీటర్ల నాటుసారాను, కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సీతమ్మ తండా నుంచి నంద్యాలకు తరలిస్తుండగా పట్టుకున్నారు.