ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

హిందూపురంలో కర్ణాటక మద్యం స్వాధీనం - police arrested four members hindhupura

రాష్ట్రంలో పలు చోట్ల అక్రమ మద్యం అమ్మకాలు జోరందుకుంటున్నాయి. పోలీసుల కళ్లు గప్పి అక్రమార్కులు తమదైన శైలిలో నేరాలకు పాల్పడుతూనే ఉన్నారు. అనంతపురం జిల్లా హిందూపురం కర్ణాటక నుంచి తెచ్చిన మద్యం అమ్ముతున్న నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

illegal liquor seized
హిందూపురంలో కర్ణాటక మద్యం స్వాధీనం

By

Published : Apr 24, 2020, 6:05 AM IST


కరోనా వైరస్ నివారణ కోసం లాక్ డౌన్ నడుస్తున్న నేపథ్యంలో అక్రమ మద్యం అమ్మకాలు జోరందుకున్నాయి. అనంతపురం జిల్లా హిందూపురం ఎక్సైజ్ పోలీసులు నలుగురు కేటుగాళ్లను అదుపులోకి తీసుకొని సుమారు రూ.50వేల విలువైన మద్యంను స్వాధీనం చేసుకున్నారు. కర్ణాటక నుంచి మద్యాన్ని తీసుకువచ్చి అధిక ధరకు విక్రయిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కర్ణాటక మదిగిరిలోని ఓ వైన్ షాపులో ఈనెల 17న మద్యం చోరీ జరిగింది. అయితే అదే మద్యాన్ని తీసుకువచ్చి ఎక్కువ ధరకు విక్రయిస్తున్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు దొరకలేదని... అతని ద్వారా మరిన్ని విషయాలు తెలిసే అవకాశం ఉందని ఎక్సైజ్ డీసీ విజయ్ శేఖర్ తెలిపారు.

ఇవీ చూడండి-నాటుసారా బట్టీలపై ఎక్సైజ్ అధికారుల దాడులు

ABOUT THE AUTHOR

...view details