కర్ణాటకలోని బళ్ళారి నుంచి తరలిస్తున్న అక్రమ మద్యాన్ని అనంతపురం జిల్లా విడపనకల్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నలుగురు వ్యక్తుల్ని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద ఉన్న ద్విచక్రవాహనాలను సీజ్ చేశారు. రాష్ట్రంలో మద్యం రేట్లు పెరగడంతో ఇలా అక్రమంగా మందును తరలించి అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు విడపనకల్ ఎస్ఐ గోపి తెలిపారు. ఎవరైనా ఇలాంటి అక్రమాలకు పాల్పడితో వారిపై కేసులు నమోదు చేసి... కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
కర్ణాటక మద్యం అక్రమ తరలింపు... నలుగురు అరెస్ట్ - విడపనకల్లో అక్రమ మద్యం వార్తలు
అక్రమంగా మద్యాం తరలిస్తున్న నలుగురిని అనంతపురం జిల్లా విడపనకల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి మద్యం సీసాలను, ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు.
అనంతపురంలో అక్రమ మద్యాన్ని తరలిస్తున్న వారిని పట్టుకున్న పోలీసులు