అనంతపురం జిల్లా గుడిబండ మండలం జీఎస్ తాండ గ్రామ శివారున అటవీ ప్రాంతంలో నాటు సారా తయారు చేస్తున్నారన్న సమాచారంతో గుడిబండ పోలీసులు దాడులు నిర్వహించారు. పోలీసులు వస్తున్నారన్న సమాచారంతో తయారీ దారులు అక్కడి నుంచి పరారయ్యారు. సారా తయారీకి ఉపయోగించిన 50 లీటర్ల సారా ఊటను పోలీసులు ధ్వంసం చేశారు. చట్టవ్యతిరేక కార్య కలాపాలకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు ఎస్సై హెచ్చరించారు.
సారా తయారీ కేంద్రంపై పోలీసుల దాడులు.. 50 లీటర్ల సారా ధ్వంసం
అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గంలో నాటు సారా తయారీ దారులు రోజురోజుకు అధికమవడంతో పోలీసులు దాడులు నిర్వహిస్తున్నారు. తాజాగా గుడిబండ మండలం జీఎస్ తాండ గ్రామ శివారులో సారా తయారీకి ఉపయోగించే 50 లీటర్ల సారా ఊటలను పోలీసులు ధ్వంసం చేశారు.
నాటుసారా తయారీ కేంద్రంపై పోలీసుల దాడులు