అనంతపురం జిల్లా కదిరి మండలం కారెడ్డిపల్లి తండా, పట్నం గ్రామాల సమీపంలోని ప్రభుత్వ భూములను కొందరు చదును చేసేందుకు ప్రయత్నించారు. గుర్తించిన స్థానికులు వారిని అడ్డుకుని అధికారులకు ఫిర్యాదు చేశారు. రెవెన్యూ అధికారులు అక్కడికి చేరుకొని ప్రభుత్వ భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. స్థానికుల ఆందోళన, అధికారుల హెచ్చరికలతో వెనక్కి తగ్గిన కబ్జాదారులు అక్కడనుంచి వెళ్లిపోయారు.
ప్రభుత్వ భూమినే కబ్జా చేసేందుకు యత్నం - అనంతపురం జిల్లా భూ కబ్జా వార్తలు
తమ పొలాలకు సమీపంలోని విలువైన ప్రభుత్వ భూమిపై కన్నేసిన కొందరు వ్యక్తులు ఆ భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నించారు. యథేచ్ఛగా ప్రభుత్వ భూమిని చదును చేస్తున్న విషయాన్ని గుర్తించిన గ్రామస్థులు వారిని అడ్డుకున్నారు. సమస్యను రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.

illegal land-acquisition-in-kadiri mandal ananthapurama district