అనంతపురం జిల్లా డీ హిరేహాళ్, గుమ్మగట్ట మండలాల్లో అనంతపురం ఎస్ఈబీ అడిషనల్ ఎస్పీ రామ్మోహన్ ఆధ్వర్యంలో నిర్వహించిన దాడుల్లో ఆరుగురిని అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 1248 కర్ణాటక మద్యం పాకెట్లు, రెండు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు రాయదుర్గం ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సీఐ పవన్‌కుమార్ తెలిపారు. కర్ణాటక నుంచి ఆంధ్రలోకి భారీగా మద్యం రవాణా అవుతున్నట్లు అధికారులకు సమాచారం అందడంతో అధికారులు దాడులు నిర్వహించారు. అలాగే రాయదుర్గం మండలం టీ వీరాపురం గ్రామం నుంచి రాయదుర్గం పట్టణానికి ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా ఇసుక అక్రమ రవాణా చేస్తున్న ట్రాక్టర్ని వారు సీజ్ చేశారు.
కర్ణాటక మద్యం కేసులో ఆరుగురు అరెస్ట్ - illegal liquor seized news in anantapur
రాష్ట్రంలో మద్యం నిషేధం అమల్లో భాగంగా మద్యం ధరలను ప్రభుత్వం పెంచింది. మద్యానికి డిమాండ్ పెరగడంతో ఇతర రాష్ట్రాల నుంచి తక్కువ ధరలకు మద్యాన్ని కొనుగోలు చేసి అక్రమంగా అధిక ధరలకు వివిధ జిల్లాలో విక్రయిస్తున్నారు. సమాచారం తెలుసుకుంటున్న ఎస్ఈబీ అధికారుల దాడుల్లో భారీగా మద్యాన్ని పట్టుకుంటున్నారు. అనంతపురం జిల్లా డీ హిరేహాళ్, గుమ్మగట్ట మండలాల్లో కర్ణాటక మద్యాన్ని స్వాధీనం చేసుకుని ఆరుగురిని అరెస్టు చేశారు.
![కర్ణాటక మద్యం కేసులో ఆరుగురు అరెస్ట్ కర్ణాటక మద్యం కేసులో 6 మంది అరెస్ట్](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8360486-382-8360486-1597026724756.jpg)
కర్ణాటక మద్యం కేసులో 6 మంది అరెస్ట్
ఇవీ చదవండి