అనంతపురం జిల్లా పుట్టపర్తిలో చిత్రావతి నదిపై నిర్మించిన అక్రమకట్టడాల కూల్చివేత వివాదాస్పదంగా మారింది. ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా తమ నిర్మాణాలు కూల్చివేస్తున్నారంటూ కొందరు ఆందోళనకు దిగారు. కనీసం ఇంటిలో సామాన్లను కూడా తీసుకోనివ్వకుండా కూల్చివేస్తున్నారని బాధితులు ఆరోపించారు. ఇదేం దౌర్జన్యం అని అడిగితే విచక్షణారహితంగా దాడి చేశారన్నారు. వైకాపా నాయకులు ప్రోద్బలంతోనే ఇదంతా చేస్తున్నారని బాధితులు వాపోయారు.
చిత్రావతి నదిపై అక్రమకట్టడాల కూల్చివేత - పుట్టపర్తి తాజా సమాచారం
చిత్రావతి నదిపై నిర్మించిన అక్రమ కట్టడాలను ప్రభుత్వాధికారులు జేసీబీ సాయంతో కూల్చివేశారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చివేస్తున్నారంటూ బాధితులు వాపోయారు.

పుట్టపర్తిలో అక్రమ కట్టడాలు కూల్చివేత