ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విడపనకల్​లో గుట్కా తరలింపు... వ్యక్తి అరెస్ట్​ - కర్ణాటక రాష్ట్రం బళ్ళారి

కర్ణాటక నుంచి తరలిస్తున్న రూ.35 వేలు విలువ చేసే నిషేధిత గుట్కాను అనంతపురం జిల్లా విడపనకల్​ పోలీసులు పట్టుకున్నారు. డోనేకల్ చెక్ పోస్టు​లో తనిఖీ చేస్తుండగా ద్విచక్రవాహనంపై గుట్కాలు తరలిస్తున్న వ్యక్తిని అరెస్ట్​ చేశారు.

illegal gutka transport seized
రూ.35 వేలు విలువ చేసే నిషేదిత గుట్కా స్వాధీనం

By

Published : Jan 11, 2021, 1:36 PM IST

అనంతపురం జిల్లా.. విడపనకల్ మండలంలో కర్ణాటక నుంచి తరలిస్తున్న రూ.35 వేల విలువ చేసే నిషేధిత గుట్కాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డోనేకల్ చెక్ పోస్ట్​లో వాహనాలను తనిఖీ చేస్తుండగా.. కర్ణాటక రాష్ట్రం బళ్ళారి నుంచి డోన్ మండలానికి వెళ్తున్న ద్విచక్రవాహనాన్ని పరిశీలించారు.

గుట్కా ప్యాకెట్లు గుర్తించి.. సరుకును స్వాధీనం చేసుకున్నారు. ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. నిషేధిత గుట్కా ఎవరు తరలించినా.. అమ్మిన వారిపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని వారు హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details