అనంతపురం జిల్లా గుత్తి రోడ్డుపై పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో కర్ణాటక నుంచి అక్రమంగా తరలిస్తున్న గుట్కా ప్యాకెట్లు పట్టబడ్డాయి. స్వాధీనం చేసుకున్న ఈ సరుకు విలువ రూ.80వేలు ఉంటుందని గుంతకల్లు రూరల్ ఎస్సై వలి తెలిపారు. బొలేరో వాహనం డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నామన్నారు. గుట్కా ప్యాకెట్లను నిందితుడు కర్ణాటక రాష్ట్రంలోని బళ్లారి నుంచి కడపకు తరలిస్తున్నట్లు వివరించారు. దీనిపై కేసు నమోదు చేశారు.
రూ.80వేలు విలువైన గుట్కాల పట్టివేత.. ఒకరి అరెస్ట్ - అనంతపురంలో గుట్కా పట్టివేత వార్తలు
అనంతపురం జిల్లా గుంతకల్లు పోలీసులు.. గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. బొలేరో వాహన చోదకుడిని అరెస్ట్ చేశారు. పట్టుబడిన గుట్కాల విలువ రూ. 80వేలు ఉంటుందని అంచనా వేశారు.
గుట్కా పట్టివేత
Last Updated : Dec 31, 2020, 6:40 PM IST