ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రొద్దం మండలంలో అక్రమ మద్యం పట్టివేత...ఒకరి అరెస్ట్

అనంతపురం జిల్లా రొద్దం మండలంలో అక్రమంగా తరలిస్తున్న కర్ణాటక మద్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. మద్యాన్ని సీజ్ చేసి ఓ వ్యక్తి పై కేసు నమోదు చేశారు.

By

Published : Oct 24, 2020, 6:26 PM IST

రొద్దం మండలంలో అక్రమ మద్యం పట్టివేత
రొద్దం మండలంలో అక్రమ మద్యం పట్టివేత

అనంతపురం జిల్లా రొద్దం మండలంలోని జక్కలచెరువు వద్ద పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఓ ద్విచక్ర వాహనాన్ని తనిఖీ చేయగా.. 149 ప్యాకెట్ల కర్ణాటక మద్యాన్ని పోలీసులు గుర్తించారు. మద్యాన్ని సీజ్ చేసిన పోలీసులు... ఓ వ్యక్తిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.

విశాఖ జిల్లాలో...

విశాఖ జిల్లా పాయకరావుపేట లో తెలంగాణ మద్యం సీసాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నామవరం జాతీయ రహదారి నుంచి గుంటపల్లి వైపు మోటర్ సైకిల్ పై మద్యం తరలిస్తుండగా పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. 24 మద్యం బాటిళ్లను సీజ్ చేసి ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు తెలిపారు.

ఇదీచదవండి

కోనాంలో అబ్బురపరుస్తున్న అందాల జలపాతం

ABOUT THE AUTHOR

...view details