అనంతపురం నుంచి శింగనమలకు ఈ నెల 22న రెండు లారీల్లో 860 బియ్యం బస్తాలు వచ్చినట్లు రికార్డుల్లో నమోదు చేశారు. కానీ ఒక లారీ మాత్రమే 430 బియ్యం బస్తాల లోడ్‌తో శింగనమల స్టాక్ పాయింట్‌కు చేరింది. సమాచారం అందుకున్న అధికారులు శింగనమలకు చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.
పక్కదారి పడుతున్న పేదల బియ్యం - అనంతపురం జిల్లాలో లాక్డౌన్ ప్రభావం
లాక్డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న పేదలకు… రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా రేషన్ బియ్యం అందిస్తోంది. అనంతపురం జిల్లాలో పేదలకు అందాల్సిన బియ్యం పక్కదారి పడుతోంది. పేదల కడుపు నింపాల్సిన బియ్యం అక్రమార్కుల జేబులు నింపుతోంది.
శింగనమల గోదాములు