ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

భార్యపై స్నేహితులతో కలిసి భర్త అత్యాచారం - భార్యపై స్నేహితులతో కలిసి అత్యాచారం చేసిన భర్త

కట్టుకున్న భార్యను అత్యాచారం చేశాడు ఓ భర్త. భర్త అత్యాచారం చేయడమేంటీ అని అనుకుంటున్నారా..? భార్యపై అనుమానంతో ఆ ప్రబుద్ధుడు స్నేహితులతో కలిసి ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఈ ఘటన అనంతపురం జిల్లా కదిరిలోని ఓ గ్రామంలో జరిగింది.

husband raped his wife with friends in anantapur dst
చికిత్స పొందుతున్న బాధితురాలు

By

Published : Dec 4, 2019, 9:04 AM IST

Updated : Dec 4, 2019, 1:25 PM IST

కట్టుకున్న భార్యపైనే దారుణానికి ఒడిగట్టిన భర్త

అనంతపురం జిల్లా కదిరిలోని ఓ గ్రామంలో దారుణం జరిగింది. భార్య మరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుందనే అనుమానంతో ఓ భర్త కిరాతకానికి ఒడిగట్టాడు. కట్టుకున్న భార్యను.. స్నేహితుడితో కలిసి మంచానికి కట్టేసి.. ఇద్దరూ కలిసి అత్యాచారం చేశారు. నాలుగు రోజుల కిందట జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తీవ్రంగా గాయపడిన బాధితురాలు శనివారం పుట్టింటికి వెళ్ళింది. కూతురు ఆరోగ్య పరిస్థితిపై అనుమానం కలిగిన బాధితురాలి తల్లి ఆమెను ప్రశ్నించింది. భర్త చేసిన దారుణాన్ని బాధితురాలు తల్లికి చెప్పింది. దీనిపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. గాయాలతో బాధపడుతున్న ఆమెను చికిత్స నిమిత్తం కదిరి ప్రాంతీయ వైద్యశాలకు తీసుకువెళ్లారు. విషయం తెలుసుకున్న రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు పర్వీన్ భాను.. బాధితురాలిని పరామర్శించారు. తన పట్ల క్రూరంగా వ్యవహరించిన భర్త, ఆయన స్నేహితుణ్ని కఠినంగా శిక్షించాలని బాధితురాలు వేడుకుంటోంది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Last Updated : Dec 4, 2019, 1:25 PM IST

ABOUT THE AUTHOR

...view details