వేట కొడవలితో భార్యను నరికి చంపిన భర్త - amidyala
కుటుంబ కలహాలతో భార్యను అతి కిరాతంగా హత్య చేశాడో వ్యక్తి. అడ్డొచ్చిన బంధువులను సైతం తీవ్రంగా గాయపరిచి పారిపోయాడు.

అనంతపురం జిల్లా అమిద్యాల గ్రామంలో దారుణం జరిగింది. కుటుంబ కలహాలతో భార్యను భర్త వేట కొడవలితో నరికి అతి దారుణంగా హత్య చేశాడు. నారాయణ స్వామి-పార్వతి దంపతులు అమిద్యాల గ్రామంలో నివాసముంటున్నారు. అయితే కుటుంబ కలహాల నేపథ్యంలో భర్త నారాయణ స్వామి తన భార్య పార్వతిని (40) సోమవారం తెల్లవారుజామున వేట కొడవలితో నరికి హత్య చేశాడు. పక్కనే ఉండే సమీప బంధువులు అడ్డు రావడంతో వారిపైనా కొడవలితో దాడి చేశాడు. దీంతో మునీంద్ర, రాజు అనే వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని గాయపడిన వారిని పోలీసుల వాహనంలోనే హుటాహుటిన ఉరవకొండ ప్రభుత్వం ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స నిమిత్తం అనంతపురం ఆసుపత్రికి తరలించారు. హత్యానంతరం నిందితుడు పరారయ్యాడు. పోలీసులు హత్య వెనుక కారణాలను వెలికి తీస్తున్నారు.