ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

భార్య వెళ్లిపోయిందని.. మనస్తాపంతో భర్త ఆత్మహత్య - recent hanging incident in nallacheruvu

భార్య ఇంట్లో నుంచి వెళ్లిపోయిందన్న బాధతో భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. దంపతుల మధ్య జరిగిన చిన్నపాటి గొడవ ఇంతటి దారుణానికి దారి తీసింది. ఈ ఘటన అనంతపురం జిల్లాలో జరిగింది.

ఆటోకు ఉరివేసుకొని భర్త ఆత్మహత్య

By

Published : Nov 2, 2019, 12:39 PM IST

ఆటోకు ఉరివేసుకొని భర్త ఆత్మహత్య

అనంతపురం జిల్లా కదిరిలోని కుటాగుళ్ల ప్రాంతానికి చెందిన ఆటో డ్రైవర్ రమణ.. ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య ఇంటి నుంచి వెళ్లిపోవడమే ఇందుకు కారణమని కుటుంబీకులు రోదిస్తున్నారు. చిన్నపాటి గొడవ కారణంగా మాటా మాటా అనుకున్న అనంతరం రమణ భార్య.. పిల్లల్ని తీసుకుని ఇల్లు విడిచివెళ్లింది. రాత్రి వరకూ వెతికినా ఆచూకీ తెలియకపోవడం రమణను తీవ్రంగా బాధించింది. పాత స్టేషన్ దగ్గర పురుగుల మందు తాగిన అనంతరం.. తన ఆటోకే గొంతును బిగించుకుని ఉరి వేసుకున్నాడు. రమణ మృతదేహాన్ని గమనించిన స్థానికులు.. నల్లచెరువు పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతుడిని గుర్తించిన పోలీసులు.. అతని సంబంధికులకు విషయం చేరవేశారు. రమణ కుటుంబీకుల రోదనలు.. కంటతడి పెట్టించాయి.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details