ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

భార్య వెంటే భర్త 'అనంత'లోకాలకు.. అనాథలైన చిన్నారులు

అల్లా సాక్షిగా అడుగడుగునా తోడుంటానని ఆ భర్త చేసిన ప్రమాణం నిజమైంది. కష్టసుఖాల్లో కలిసి కట్టుగా ఉన్న ఆ దంపతులు చావులోనూ తోడుగా నిలిచారు. భార్య మృతిని జీర్ణించుకోలేని ఆ భర్త గుండె ఆగిపోయింది. ఒకేసారి తల్లిదండ్రులు దూరం కావటంతో ఇద్దరు చిన్నారులు అనాథలుగా మిగిలారు. అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణం టైలర్స్​ కాలనీలో జరిగిన విషాద ఘటన వివరాలివి.

భార్య వెంటే భర్త 'అనంత'లోకాలకు.. అనాథలైన చిన్నారులు
భార్య వెంటే భర్త 'అనంత'లోకాలకు.. అనాథలైన చిన్నారులు

By

Published : Aug 17, 2020, 9:19 PM IST

అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో విషాదం జరిగింది. భార్య మరణాన్ని తట్టుకోలేని ఓ భర్త గుండెపోటుతో మరణించాడు. వివరాల్లోకి వెళ్తే.. పట్టణానికి చెందిన జిలాన్​బాషా, షమీమ్​ భార్యాభర్తలు. వీరు స్థానిక టైలర్స్​ కాలనీలో నివాసముంటున్నారు. జిలాన్​బాషా కూరగాయల వ్యాపారం చేస్తుండగా.. భార్య షమీమ్​ పట్టణ సమీపంలోని దాల్​మిల్​ కర్మాగారంలో పనిచేస్తోంది. వీరికి కుమారుడు మహబూబ్​బాషా, కుమార్తె పర్వీన్​ ఉన్నారు.

షమీమ్ సోమవారం​ కర్మాగారంలో పని చేస్తుండగా ప్రమాదవశాత్తు చీర యంత్రంలో చిక్కుకుని అందులో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. తోటి కూలీలు ఆమెను తాడిపత్రి ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యంలోనే మృతి చెందింది. భర్త జిలాన్​బాషా ఆస్పత్రికి చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపించాడు. అనంతరం గుండెలో నొప్పిగా ఉందంటూ అక్కడే కుప్పకూలిపోయాడు. జిలాన్​బాషాను పరీక్షించిన వైద్యులు మృతి చెందినట్లు ధ్రువీకరించారు. ఒకేసారి తల్లిదండ్రులు దూరం కావటంతో చిన్నారులిద్దరూ అనాథలుగా మిగిలారు.

ABOUT THE AUTHOR

...view details