అనంతపురం జిల్లా హిందూపురం మండలం వీవర్స్ కాలనీలో తిప్పేస్వామి, గౌతమి దంపతులు ఉండేవారు. వీరిద్దరి మధ్య ఏం జరిగిందో తెలియదు గానీ గౌతమిపై తిప్పేస్వామి కత్తితో దాడి చేశాడు. దీంతో తీవ్రగాయాలైన గౌతమిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితురాలి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. కుటుంబ కలహాల వలనే తిప్పేస్వామి భార్యపై దాడి చేసినట్లు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
హిందూపురంలో భార్యపై భర్త కత్తితో దాడి - భార్యపై దాడి చేసిన భర్త
కట్టుకున్న భార్యపైనే కత్తితో దాడికి తెగబడ్డాడో భర్త. ఈ ఘటన అనంతపురం జిల్లా హిందూపురం మండలం వీవర్స్ కాలనీలో జరిగింది.
భార్తను కత్తితో దాడి చేసిన భర్త