HUNTERS ARREST: జింకలను వేటాడి వాటి మాంసాన్ని విక్రయిస్తున్న ముఠాను ఉరవకొండ పోలీసులు, అటవీశాఖ అధికారులు సంయుక్తంగా దాడులు చేసి పట్టుకున్నారు. మంగళవారం వన్యప్రాణులను హతమారుస్తున్నారన్న పక్కా సమాచారంతో ఉరవకొండ సీఐ శేఖర్ పొలాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో జింకలను చంపి వాటి మాంసం విక్రయించడానికి తీసుకువెళ్తున్న నలుగురిని పట్టుకున్నారు. వారి వద్ద నుంచి నాలుగు జింకల చర్మాలు, 25 ప్యాకెట్ల జింక మాంసం, జింకలను పట్టుకునేందుకు ఉపయోగించే ఉచ్చులు, జింకల కొమ్ములు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అదుపులోకి తీసుకుని ఉరవకొండ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. నిందితులందరూ..గుంతకల్‌కు చెందినవారుగా గుర్తించారు.
HUNTERS ARREST: జింకల మాంసం విక్రయిస్తున్న ముఠా అరెస్ట్ - అనంతపురం జిల్లా ముఖ్యంశాలు
HUNTERS ARREST: అనంతపురం జిల్లా విడపనకల్లు మండలం కొట్టాలపల్లి గ్రామం వద్ద జింకలను వేటాడి వాటి మాంసాన్ని విక్రయిస్తున్న ముఠాను పోలీసులు, అటవీ శాఖ అధికారులు సంయుక్తంగా దాడులు చేసి పట్టుకున్నారు.
జింకల మాంసం విక్రయిస్తున్న ముఠా అరెస్ట్