ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరశన దీక్ష - live updates of corona virus in andhrapradesh

కరోనా కొరల చాస్తున్న వేళ వైకాపా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని తెదేపా నాయకులు మండిపడ్డారు. వైకాపా నిర్లక్ష్యధోరణికి నిరసనగా... అనంతపురం జిల్లా కదిరిలో తెదేపా ఇన్​చార్జి వెంకటప్రసాద్ 12 గంటల నిరాహార దీక్ష చేపట్టారు.

hunger strick by tdp leader due to irresponsible behavior of state govt about corona
రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరశన దీక్ష

By

Published : Apr 15, 2020, 8:52 PM IST

కరోనా వైరస్​ను కట్టడి చేసేందుకు అనుసరించాల్సిన విధానాల పట్ల రాష్ట్ర ప్రభుత్వం...వైకాపా నాయకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని తెదేపా శ్రేణులు ఆరోపించారు. అనంతపురం జిల్లా కదిరిలో తెదేపా నియోజకవర్గ ఇన్​చార్జి కందికుంట వెంకటప్రసాద్ 12 గంటలపాటు నిరాహార దీక్ష చేపట్టారు. లాక్​డౌన్ వల్ల ఉపాధి కోల్పోయిన అన్ని వర్గాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఒక్కో కుటుంబానికి ఐదు వేల రూపాయల సాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందజేయాలని, అన్న క్యాంటీన్ లు ప్రారంభించి సామాజిక దూరం పాటిస్తూ ప్రతి పేదవాడికి ఐదు రూపాయలకే భోజనం అందించాలన్నారు. చంద్రన్నబీమాను పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ సూచించిన సప్తపది రాష్ట్రంలో అమలు కావడం లేదని విమర్శించారు. లాక్​డౌన్ వల్ల ఎన్నో కుటుంబాలు ఆకలితో ఇబ్బంది పడాల్సి వస్తుందని వారిని ఆదుకోవాల్సిన ప్రభుత్వం ప్రచారానికి ప్రాధాన్యం ఇస్తుందన్నారు. సామాజిక దూరం పాటిస్తూ పేదలకు సాయం అందించాల్సిన. తరుణంలో అధికార పార్టీ నాయకులు పదుల సంఖ్యలో వెళుతూ వైరస్ వ్యాప్తికి పరోక్షంగా కారణమవుతున్నాయని విమర్శించారు.

ABOUT THE AUTHOR

...view details