ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఎస్​ఈబీ అధికారుల తనిఖీలు... భారీగా మద్యం పట్టివేత - wine seize in ananthapuram district

రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో అక్రమంగా తరలిస్తున్న మద్యం పట్టుబడుతోంది. సరిహద్దు రాష్ట్రాల నుంచి ఈ దందా జోరందుకుంటోంది. ఈ క్రమంలో తనిఖీలు నిర్వహించిన స్పెషల్ ఎన్​ఫోర్స్​మెంట్ బ్యూరో పోలీసులు మద్యాన్ని స్వాధీనం చేసుకుని, నిందితులపై కేసులు నమోదు చేశారు.

huge wine seized in andhrapradhesh
భారీగా మద్యం పట్టివేత

By

Published : Feb 6, 2021, 7:14 PM IST

కృష్ణా జిల్లాలో...

తెలంగాణ నుంచి కృష్ణా జిల్లాలోకి అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని వత్సవాయి పోలీసులు పట్టుకున్నారు. జిల్లా ఎస్పీ రవీంద్రబాబు ఆదేశాల మేరకు ఎస్ఈబీ అడిషనల్ ఎస్పీ వకుల్ జిందల్ నేతృత్వంలో తనిఖీలు చేపట్టిన పోలీసులు... కూరగాయల లోడుతో వస్తున్న ఆటోలో తరలిస్తున్న రూ.2 లక్షలు విలువ చేసే 1,430 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. ఆటోను సీజ్ చేసి, ఒకరిని అరెస్టు చేశారు.

నెల్లూరు జిల్లాలో...

ఉదయగిరి మండలం ఎర్రపల్లిగడ్డ గ్రామం వద్ద ఆటోలో అక్రమంగా తరలిస్తున్న 220 మద్యం సీసాలను స్పెషల్ ఎన్​ఫోర్స్​మెంట్ బ్యూరో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆటోతో పాటు డ్రైవర్​ను అదుపులోకి తీసుకుని ఉదయగిరి ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.

అనంతపురం జిల్లాలో...

మడకశిర మండలం యు.రంగాపురం చెక్​పోస్ట్ వద్ద పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో కర్ణాటక నుంచి తరలిస్తున్న 850 మద్యం ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. గతంలో మద్యం కేసులో నిందితులుగా ఉన్న నలుగురు వ్యక్తులను అరెస్టు చేశారు. వీరిని కోర్టులో హాజరుపరిచి రిమాండ్​కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.

ఇదీచదవండి.

శ్రీకాకుళంలో ఎన్నికల సిబ్బందికి ఆకలి పాట్లు

ABOUT THE AUTHOR

...view details