ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

భారీగా కర్ణాటక లిక్కర్ సీజ్.. ఇద్దరి అరెస్ట్ - Huge-karnataka-liquor-seized in Rayadurgam, AnanthaPur

రాష్ట్రంలోని సరిహద్దు ప్రాంతాల్లో పొరుగు రాష్ట్రమైన కర్ణాటక నుంచి భారీగా మద్యం అక్రమ రవాణా అవుతోంది. ఈ నేపథ్యంలో సుమారు 27 బాక్సుల లిక్కర్​ను స్పెషల్ బ్రాంచ్ పోలీసులు సీజ్ చేశారు. అనంతరం ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు.

27 పెట్టెల భారీ కర్ణాటక లిక్కర్ సీజ్.. ఇద్దరి అరెస్ట్
27 పెట్టెల భారీ కర్ణాటక లిక్కర్ సీజ్.. ఇద్దరి అరెస్ట్

By

Published : May 9, 2021, 2:13 PM IST

అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణ సమీపంలోని బైపాస్ రోడ్డులో అక్రమంగా కర్ణాటక మద్యం రవాణా చేస్తుండగా స్పెషల్ బ్రాంచ్ పోలీస్ అధికారులు దాడులు నిర్వహించారు. అనంతరం రూ. 1.10 లక్షలు విలువ చేసే 27 బాక్సుల్లోని 2592 పాకెట్ల లిక్కర్​ సహా ఓ కారును స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు స్పెషల్ బ్రాంచ్ సీఐ పవన్ కుమార్ తెలిపారు.

పెద్ద ఎత్తున రవాణా..

రాయదుర్గం నియోజకవర్గంలో ప్రతి నిత్యం పెద్ద ఎత్తున కర్ణాటక మద్యం రవాణా అవుతోందని.. అడ్డుకోవాల్సిన అధికారులే చోద్యం చూస్తున్నారని ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఫలితంగా లక్షలాది రూపాయల లిక్కర్ కర్ణాటక నుంచి అక్రమంగా రవాణా కొనసాగుతోంది.

అధికార పార్టీ ప్రోత్సాహమే కారణం..

అధికార వైకాపా నేతల అండదండలతో సరిహద్దు రాష్ట్రం నుంచి మద్యం సరఫరా అవుతున్నట్లు ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాయదుర్గం పట్టణం తో పాటు నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలోనూ విచ్చలవిడిగా కర్ణాటక మద్యం విక్రయిస్తున్నారు.

ఇవీ చూడండి :అనిశా వలలో అటవీ అధికారులు

ABOUT THE AUTHOR

...view details