అనంతపురం జిల్లా కదిరి నుంచి పొరుగు రాష్ట్రం కర్ణాటకకు అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని తనకల్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బియ్యం తరలిస్తున్న లారీలో ఉన్న 1200 బస్తాల సరకును సీజ్ చేశారు. సరైన రికార్డులు లేనందున బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై శ్రీనివాసులు తెలిపారు. రోజూ వివిధ మార్గాల్లో బియ్యం అక్రమ రవాణా జరుగుతున్నా... వాటిని నియంత్రించడంలో అధికారులు విఫలం అవుతున్నారని స్థానికులు విమర్శిస్తున్నారు. అక్రమార్కులపై తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
Ration rice seized : రేషన్ బియ్యం పట్టివేత... 1200 బస్తాల సరకు స్వాధీనం - ananthapuram district latest news
అనంతపురం జిల్లా తనకల్లులో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. సరైన పత్రాలు లేనందునే సరకును సీజ్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
రేషన్ బియ్యం పట్టివేత