ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఇంట్లోని ట్రంకు పెట్టెల్లో బంగారం, వెండి నిల్వలు..

అనంతపురం జిల్లాలో ట్రంకు పెట్టెల్లో నిధులు దాచిన ఘటన సంచలనం సృష్టిస్తోంది. ఓ ఇంట్లో ఆయుధాలు దాచిపెట్టారనే సమాచారంతో తనిఖీలకు వెళ్లిన పోలీసులకు... 8 ట్రంకు పెట్టెల్లో బంగారం, వెండి, నగదు లభించటం కలకలం రేపుతోంది. అవన్నీ జిల్లా కేంద్రంలోని ట్రెజరీ ఉద్యోగి మనోజ్‌కు చెందినవిగా ప్రాథమిక విచారణలో పోలీసులు నిర్ధారించారు. ముగ్గురు డీఎస్పీలు, రెవెన్యూ అధికారుల సమక్షంలో తనిఖీలు జరిపి మరిన్ని ఆధారాలు సేకరించారు.

ఇంట్లోని ట్రంకుపెట్టెల్లో బంగారం, వెండి నిల్వలు.. పోలీసుల సోదాలు
ఇంట్లోని ట్రంకుపెట్టెల్లో బంగారం, వెండి నిల్వలు.. పోలీసుల సోదాలు

By

Published : Aug 18, 2020, 9:09 PM IST

Updated : Aug 19, 2020, 3:19 AM IST

అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం ఎస్సీ కాలనీలోని నాగలింగ ఇంట్లో ఆయుధాలు ఉన్నాయని సీసీఎస్ డీఎస్పీ శ్రీనివాసులకు వచ్చిన సమాచారం మేరకు సోదాలు జరిపిన పోలీసులే విస్తుపోయేలా భారీ మొత్తంలో నిధులు బయటపడ్డాయి. నాగలింగ మావయ్య బాలప్ప ఇంట్లో సోదాలు జరిపిన పోలీసులకు 8 ట్రంకు పెట్టెలు లభించాయి. వాటిని తెరుస్తున్న కొద్దీ బంగారం, వెండి, నగదు బయటపడ్డాయి.

భారీగా నిధులు బయటపడ్డాయనే సమాచారం తెలుసుకున్న ఎస్పీ సత్యయేసుబాబు... అనంతపురం డీఎస్పీ వీరరాఘవరెడ్డి, తాడిపత్రి డీఎస్పీ శ్రీనివాసులతోపాటు సీసీఎస్​ డీఎస్పీని అక్కడికి వెళ్లాలని ఆదేశించారు. తహసీల్దార్‌ సమక్షంలో పెట్టెలన్నీ తెరిచి అందులోని నిధుల్ని లెక్కించారు. ఓ తుపాకినీ స్వాధీనం చేసుకున్నారు. అనంతరం బాలప్పను ప్రశ్నించిన పోలీసులు... అనంతపురం ట్రెజరీలో జూనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న మనోజ్‌ ఆ పెట్టెలను అక్కడ ఉంచినట్లు తేల్చారు.

బంగారు నగల పరిమాణం కొలిచేందుకు స్వర్ణకారుడిని పిలిపించిన అధికారులు... నగదు లెక్కింపు యంత్రంతో నోట్లకట్టలు లెక్కించారు. విచారణ ముమ్మరం చేసిన పోలీసులు... చిరు ఉద్యోగి అయిన మనోజ్‌కు ఇంత బంగారం, వెండి, డబ్బు ఎలా వచ్చిందనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

ఆదాయపన్ను, అనిశా అధికారులతోపాటు సంబంధిత శాఖలకు నిధుల గురించి సమాచారమిచ్చామని ... మరింత లోతుగా విచారణ జరుపుతామని పోలీసులు వెల్లడించారు.


ఇదీ చూడండి..

మాజీ ప్రియుణ్ని చంపి.. రూ.12 లక్షలు తీసుకుని మరొకరితో వెళ్లిపోయింది..!

Last Updated : Aug 19, 2020, 3:19 AM IST

ABOUT THE AUTHOR

...view details