Ganja seized in : అనంతపురం జిల్లా వజ్రకరూర్ మండలం రాగులపాడు సమీపంలో భారీగా గంజాయి పట్టుబడింది. సాలూరు, అరకు నుంచి మూడు వాహనాల్లో గంజాయి సరఫరా అవుతోందన్న సమాచారంతో... ఉరవకొండ సీఐ శేఖర్, వజ్రకరూర్ ఎస్సై వెంకటస్వామి సిబ్బందితో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో అక్రమంగా తరలిస్తున్న 51.400 కిలోల గంజాయి, ఇన్నోవా సహా మూడు వాహనాలను సీజ్ చేశారు. 12 మంది ముఠా సభ్యులను అదుపులోకి తీసుకున్నట్లు గుంతకల్లు డీఎస్పీ నరసింగప్ప తెలిపారు. పట్టుబడిన గంజాయి విలువ రూ.12.85 లక్షలు ఉంటుందని వివరించారు. విజయనగరం, ఒడిశా సరిహద్దుల్లోని గ్రామాల్లో తక్కువ ధరకే సరకును కొనుగోలు చేసి, ఇక్కడ అధిక మొత్తానికి అమ్ముతూ అక్రమ లాభార్జనకు పాల్పడుతున్నారని డీఎస్పీ అన్నారు.
Ganja seized in : పోలీసుల తనిఖీలు..భారీగా గంజాయి పట్టివేత
Ganja seized : గంజాయి అక్రమ రవాణాను అరికట్టడానికి ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా అవి క్షేత్ర స్థాయిలో అమలవడం లేదు. ప్రతిరోజు ఏదో ఒక ప్రాంతంలో అక్రమార్కులు గంజాయి అక్రమ రవాణాకు పాల్పడుతూనే ఉన్నారు. ఈ క్రమంలో శనివారం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో అధికారులు దాడులు జరిపారు. ఈ తనిఖీల్లో భారీగా గంజాయి పట్టుబడింది.
భారీగా గంజాయి పట్టివేత
నెల్లూరు జిల్లా వెంకటాచలం టోల్‌ప్లాజా వద్ద అక్రమంగా రవాణా అవుతున్న గంజాయిని ఎస్ఈబీ అధికారులు పట్టుకున్నారు. నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.7.38 లక్షలు విలువైన సరకును స్వాధీనం చేసుకున్నారు. కృష్ణా జిల్లా పొట్టిపాడు టోల్ ప్లాజా వద్ద 28 కిలోల గంజాయి పట్టుబడింది.
ఇదీచదవండి.