అనంతపురం జిల్లా మడకశిర నగర పంచాయతీ పరిధిలో గత ప్రభుత్వాలు ఇల్లు లేని నిరుపేదలకు ఇంటి పట్టాలు మంజూరు చేయటంతో... పలు కాలనీలు ఏర్పడ్డాయి. వాటిలో కొంత మంది ఇల్లు నిర్మించుకుని నివాసాలు ఉంటున్నారు. మరికొన్ని కాలనీల్లో మౌలిక వసతులు లేక ఖాళీగా ఉండిపోయాయి. అధికారులు ఖాళీగా ఉన్న 392 పట్టాలు రద్దు చేశారు. రద్దు చేసి ఉన్న పట్టా స్థలాల్లో కంపచెట్లు, రాళ్లను తొలగించేందుకు యంత్రాలతో అధికారులు సిద్ధమయ్యారు. ఈ విషయం తెలుసుకున్న బాధితులు తమకు ఎలాంటి నోటీసు పంపకుండా... పట్టాలను రద్దు చేసి ఆ స్థలాలు మరొకరికి ఇచ్చేందుకు పూనుకోవడం సరికాదన్నారు. ఇళ్లు నిర్మించుకునేందుకు గడువు ఇవ్వాలని అధికారులను వేడుకున్నారు.
నోటీసు ఇవ్వకుండా ఇళ్లపట్టాలు ఎలా రద్దు చేస్తారు...? - How to cancel houseboards without notice at madkasheera in ananthapuram district
గతంలో ఇల్లు లేని నిరుపేదలకు ప్రభుత్వం ఇచ్చిన ఇంటి స్థలాల్లో ఖాళీగా ఉన్న ప్రదేశాలను చదును చేసేందుకు వచ్చిన అధికారులను లబ్ధిదారులు అడ్డుకున్న సంఘటన అనంతపురం జిల్లా మడకశిర పంచాయతీ పరిధిలో చోటుచేసుకుంది.
![నోటీసు ఇవ్వకుండా ఇళ్లపట్టాలు ఎలా రద్దు చేస్తారు...? How to cancel houseboards without notice at madkasheera in ananthapuram district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6129956-736-6129956-1582121492292.jpg)
మడకశిరలో అధికారులకు, ఇళ్ల స్థలాల యాజమానులకు మధ్య వాగ్వాదం
మడకశిరలో అధికారులకు, ఇళ్ల స్థలాల యాజమానులకు మధ్య వాగ్వాదం