ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ఇళ్లు నిర్మిస్తామని చెప్పారు... పట్టా ఇచ్చి సరిపెట్టేశారు' - అనంతపురం జిల్లాలో ఇళ్ల పట్టాల లబ్ధిదారులు ఆందోళన

అనంతపురంలో ఇళ్ల స్థలాల పట్టాలు పొందిన లబ్ధిదారులు... వార్డు సచివాలయం వద్ద ఆందోళన చేపట్టారు. సొంత గూడు లేని పేదలందరికీ ఇల్లు కట్టిస్తామన్న ప్రభుత్వం... ఇప్పుడు పట్టాలను చేతిలో పెట్టి మీరే కట్టుకోవాలనడం మోసమని ఆరోపించారు.

Agitation
లబ్ధిదారుల నిరసన

By

Published : Jan 21, 2021, 1:24 PM IST

అనంతపురం జిల్లా కదిరిలోని 9వ వార్డులో ఇళ్ల పట్టాలు పొందిన లబ్ధిదారులు... వార్డు సచివాలయంలో నిరసన చేపట్టారు. ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా ఇళ్లు నిర్మించి ఇవ్వాలని సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. కరోనా సంక్షోభం వల్ల పూట గడవడమే కష్టంగా ఉందని... ఇలాంటి పరిస్థితుల్లో తాము ఇల్లు ఎలా కట్టుకుంటామని ఆందోళన వ్యక్తం చేశారు. ఇంటిని అప్పగిస్తామని ప్రకటించిన ప్రభుత్వం... ఇప్పుడు మాట మారుస్తోందని ఆరోపించారు.

అయితే.. ప్రభుత్వం 3 ఆప్షన్లను ఇచ్చిందని... తమకు అనుకూలంగా లబ్ధిదారులు ఇల్లు నిర్మించుకునే అవకాశం ఉంటుందని సచివాలయ సిబ్బంది వివరించారు. నిబంధన మేరకు బిల్లులు చెల్లిస్తామని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details