ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అర్హులైన ప్రతీ ఒక్కరికి ఇంటి పట్టా అందజేస్తాం: మంత్రి శంకరనారాయణ - ఇంటి పట్టాల పంపణీ తాజా వార్తలు

ఇంటి పట్టాల పంపణీ దేశంలో అతిపెద్ద కార్యక్రమం అని మంత్రి శంకరనారాయణ పేర్కొన్నారు. అనంతపురం జిల్లా పెనుకొండలో నిరుపేదలకు ఇంటి పట్టాల పంపిణీ కార్యక్రమం ప్రారంభించారు. అర్హులైన ప్రతీ ఒక్కరికి ఇంటి పట్టా అందజేస్తామన్నారు.

house patta distribution program at penukonda
నిరుపేదలకు ఇంటి పట్టాల పంపణీ దేశంలో అతిపెద్ద కార్యక్రమం

By

Published : Dec 25, 2020, 8:14 PM IST

అనంతపురం జిల్లా పెనుకొండలో నిరుపేదలకు ఇంటి పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి శంకరనారాయణ ప్రారంభించారు. రాష్ట్రంలో నేడు అతి పెద్ద పండుగ జరిగిందని.. ఈ కార్యక్రమంలో భాగంగా అర్హులైన ప్రతీ లబ్ధిదారునికి ఇంటి పట్టా అందజేస్తామన్నారు. పెనుకొండ పట్టణానికి చెందిన 974 మందికి ఇంటి పట్టాల పంపిణీ చేశామని.. అలాగే ఇంటి పట్టాలు ఉన్న 576 మంది తమ ఇల్లు నిర్మించుకునేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపట్టిందన్నారు.

పెనుకొండ నియోజకవర్గంలో మొత్తం 13 లేఅవుట్లు ఏర్పాటు చేశామని.. నేటి నుంచి జనవరి 7వ తేదీ వరకు దశలవారీగా 13,117 ఇంటి పట్టాలను ఇవ్వనున్నట్లు మంత్రి తెలిపారు. దీంతో అక్కా చెల్లెమ్మలు అందరూ సంతోషంగా ఉంటారన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి శంకరనారాయణతోపాటు హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్, జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు, జేసీ, పాల్గొన్నారు.

ఇదీ చూడండి:' వైఎస్‌ఆర్‌ జగనన్న ఇళ్లు కాదు.. వేల ఊళ్లు కడుతున్నాం'

ABOUT THE AUTHOR

...view details