మున్సిపల్ అధికారుల ద్వంద్వ వైఖరిని నిరసిస్తూ అనంతపురం జిల్లా కదిరిలో ఇంటి యజమానులు, తెదేపా శ్రేణులు ఆందోళన చేపట్టాయి. కదిరి పట్టణంలోని ప్రధాన రహదారి విస్తరణ పనులకు సంబంధించి మున్సిపల్ అధికారులు సర్వేకి సిద్ధమయ్యారు. కరోనా వైరస్ తీవ్రత దృష్ట్యా కొద్ది రోజులు రోడ్డు విస్తరణకు సంబంధించి సర్వే నిలిపేయాలని ఇంటి యజమానులు అధికారులకు విజ్ఞప్తి చేశారు. మొదట అంగీకరించిన అధికారులు రోజు గడవకముందే పోలీస్ బందోబస్తుతో సర్వే పనులకు సిద్ధమయ్యారు.
మున్సిపల్ అధికారుల వైఖరిని నిరసిస్తూ.. ఇళ్ల యజమానుల ఆందోళన - kadiri tdp news
మున్సిపల్ అధికారుల వైఖరిని నిరసిస్తూ.. అనంతపురం జిల్లా కదిరిలో ఇళ్ల యజమానులు ఆందోళన చేపట్టారు. వారికి తెదేపా శ్రేణులు మద్దతు తెలిపాయి. రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా సర్వేను కొంతకాలం నిలిపేస్తామని హమీ ఇచ్చిన అధికారులు.. పోలీసులతో వచ్చి సర్వే చేపట్టారని ఇళ్ల యజమానులు ఆరోపించారు.
ఓ వైపు కొవిడ్ నిబంధనలు ఉల్లంఘిస్తున్న వారిపై కేసులు నమోదు చేస్తున్న అధికారులు మరోవైపున పదుల సంఖ్యలో సిబ్బందితో సర్వేకి రావడంపై స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేశారు. సర్వేని తాత్కాలికంగా వాయిదా వేయని పక్షంలో తాము రోడ్లపైకి వచ్చి ఆందోళన చేపడతామని ఇంటి యజమానులు స్పష్టం చేశారు. అధికారుల తీరును తప్పుపడుతూ స్థానికులకు మద్దతుగా తెలుగుదేశం కదిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కందికుంట వెంకటప్రసాద్ ఆందోళనల్లో పాల్గొన్నారు.
ఇదీ చదవండి:LIQUOR SEIZED: సెప్టిక్ ట్యాంక్ అనుకుంటున్నారా? మీరే చూడండి..