" సర్వం కోల్పోయి కట్టుబట్టలతో రోడ్డున పడ్డాం" - అనంతపురం జిల్లా
అనంతపురం జిల్లాలో ఒక్కసారిగా కురిసిన భారీ వర్షాలకు పేదల ఇళ్లు కూలి రోడ్డున పడ్డారు. కట్టుబట్టలతో రోడ్డున పడ్డాం అంటూ వారు రోదించే తీరు పలువురిని కంట తడి పెట్టించింది.
వరదలు కూల్చేసాయి
By
Published : Sep 24, 2019, 10:50 AM IST
వరదలు కూల్చేసాయి
అనంతపురం జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు రోడ్లు జలమయమవ్వగా, ఇళ్లు కూలి పేదలు రోడ్డున పడ్డారు. కళ్యాణదుర్గం మున్సిపాలటీ పరిధిలోని నాలా వద్ద పేదలు నిర్మించుకున్న ఇళ్లు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాయి. వర్షాలకు భయపడి వేరే చోట తలదాచుకున్న వారు ఉదయం వచ్చి చూసేసరికి ఇళ్లు పూర్తిగా పడిపోయి. ఇంట్లో ఉన్న వస్తువులన్నీ వరదలో కొట్టుకపోయాయి. ఉండటానికి నిలువ నీడ లేదనీ, దాచుకున్న సొత్తంతా కొట్టుకుపోయిందని బాధితులు బోరున విలపిస్తున్నారు. సర్వం కోల్పోయిన తమకు ఎవరైనా సాయం చేయండంటూ దీనంగా అర్థిస్తున్నారు.