అనంతపురం జిల్లా ముదిగుబ్బ మండలం గుంజేపల్లెలో గ్యాస్ లీకై ఇళ్లు పూర్తిగా దగ్ధమైంది. గ్రామానికి చెందిన నారాయణస్వామి ఇంటిలో గ్యాస్ లీకై మంటలు చెలరేగాయి. కుటుంబ సభ్యులు ఇంటికి తాళం వేసి బయటకు వెళ్లిన సమయంలో ఈ ప్రమాదం జరిగింది. పెద్ద ఎత్తున మంటలు రావడంతో ఇంట్లో వస్తువులు పూర్తిగా కాలిపోయాయి. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. రూ 12 లక్షలు నష్టం వాటిల్లినట్లు బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు.
గ్యాస్ లీకై ఇల్లు దగ్ధం.. 12 లక్షల ఆస్తి నష్టం - గుంజేపల్లెలో గ్యాస్ లీక్
ఓ ఇంట్లో గ్యాస్ లీకై పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో... పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటన అనంతపురం జిల్లా ముదిగుబ్బ మండలం గుంజేపల్లెలో జరిగింది.
గ్యాస్ లీకై ఇళ్లు దగ్ధం