తెదేపా ప్రభుత్వ హయంలో మంజూరైన ఇళ్ల స్థలాలను వైకాపా ప్రభుత్వం లాగేసుకుందని ఆరోపిస్తూ..అనంతపురం జిల్లా మామిడూరు గ్రామానికి చెందిన లబ్ధిదారులు ఆందోళకు దిగారు. స్థానిక అధికారులతో కలిసి వైకాపా నాయకులు మోసం చేశారని ఆరోపించారు. ఇళ్లపట్టాల పంపిణీకి వచ్చిన ఎమ్మెల్యే ఉషాశ్రీ చరణ్‌తో వాగ్వాదానికి దిగారు. పోలీసులు కలుగజేసుకొని లబ్ధిదారులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఆర్థిక స్థోమత లేక గత ప్రభుత్వం ఇచ్చిన స్థలంలో ఇళ్లు నిర్మించుకోలేకపోయామని...ఇప్పుడు వైకాపా ప్రభుత్వం తమ స్థలాలను స్వాధీనం చేసుకుందని 63 మంది లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వమే తమకు న్యాయం చేయాలని వేడుకొంటున్నారు.
'ప్రభుత్వం మా ఇళ్ల పట్టాలను లాగేసుకుంది' వైకాపా నేతల ఘర్షణ
గుంటూరు జిల్లా ఓర్వకల్లులో ఇళ్లపట్టాల పంపిణీ వైకాపా రెండు వర్గాల మధ్య వివాదాన్ని రేకెత్తించింది. గ్రామంలోని అర్హులకు ఎమ్మెల్యే నంబూరు శంకరరావు, ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు ఈ ఉదయం పట్టాలు పంపిణీ చేసినవెళ్లారు. వారి పర్యటన అనంతరం గ్రామ స్థాయి వైకాపా నేతలు రెండు వర్గాలుగా విడిపోయి ఘర్షణకు దిగారు. అర్హులకు ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా చేసారని ఒకరిపై ఒకరు పరస్పర ఆరోపణలు చేసుకొని దాడులకు పాల్పడ్డారు. ఘర్షణలో పలువురికి గాయాలయ్యాయి. పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరువర్గాలని చెదర గొట్టారు.
ఇదీచదవండి
గుంటూరులో వైకాపా వర్గాల ఘర్షణ ప్రొద్దుటూరులో తెదేపా నేత నందం సుబ్బయ్య దారుణ హత్య