ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

టిక్​టాక్ చేశారు...సస్పెండ్ అయ్యారు... - ananthapuram

రోజురోజుకి ప్రజల్లో టిక్​టాక్ మోజు ఇంకా పెరుగుతూనే ఉంది. వైద్యశాలలో విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తూ...టిక్​టాక్ చేసిన ఇద్దరు ఒప్పంద ఉద్యోగులను సస్పెండ్ చేశారు.

విధులు నిర్వహించకుండా టిక్​టాక్ చేయడంతో సస్పెండ్ అయిన ఉద్యోగులు

By

Published : Aug 2, 2019, 5:36 PM IST

విధులు నిర్వహించకుండా టిక్​టాక్ చేయడంతో సస్పెండ్ అయిన ఉద్యోగులు

అనంతపురం జిల్లా కదిరి ప్రాంతీయ వైద్యశాలలో విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇద్దరు ఉద్యోగులను తాత్కాలికంగా విధుల నుండి తొలగించారు. వైద్యశాలలో మెడాల్ కంపెనీ తరఫున శైలజ, ఒప్పంద ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్న సద్గుణ ల్యాబ్ టెక్నీషియన్లుగా పనిచేస్తున్నారు. వీరిద్దరు ల్యాబ్​లో టిక్ టాక్ చేస్తూ...రోగులను పట్టించుకోలేదు. ఈ విషయాన్ని గమనించిన రోగులు ఆసుపత్రి సూపరింటెండెంట్​కు ఫిర్యాదు చేశారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదును...వారిద్దరు చేసిన వీడియోలను సూపరిండెంట్ ఉన్నతాధికారులకు పంపారు. శైలజ, సద్గుణలపై చర్యలు తీసుకోవాల్సిందిగా మెడల్ కంపెనీ ప్రతినిధులను, డిసిహెచ్ఎస్​కు నివేదిక పంపినట్లు సూపరిండెంటెంట్ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details