లాక్డౌన్ కారణంగా అనంతపురం జిల్లాలో ఉద్యాన రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. చేతికొచ్చిన పంట తోటలు దాటిరాలేని పరిస్థితి నెలకొంది. రెండు రోజుల క్రితం జిల్లాలోని మున్సిపాలిటీల పరిధిలో కూరగాయల విక్రయాల కోసం ప్రతి చోటా అధికారులు తాత్కాలికంగా ప్రత్యేక మార్కెట్లు ఏర్పాటు చేశారు. అయితే ఆశించినంత లాభం రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో అత్యధికంగా సాగయ్యే బెండ, వంకాయ, టమోటా తదితర కూరగాయల పంటలు అనంతపురానికి వస్తున్నాయి. అరటి రైతుల నుంచి పంట కొనుగోలు చేయలేని పరిస్థితి తలెత్తటంతో పండ్లను రవాణా చేసే లారీలకు ఇబ్బంది లేకుండా పోలీసుల అనుమతి ఇప్పించినట్లు ఉద్యానశాఖ అధికారులు చెబుతున్నారు.
లాక్‌డౌన్‌తో చిక్కుల్లో పడ్డ ఉద్యాన పంటల రైతులు - shoutdown AP due to corona virus taja news
కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వం లాక్డౌన్ విధించిన నేపథ్యంలో అనంతపురం జిల్లాలో ఉద్యాన పంటల ఉత్పత్తులు తోటలు దాటి మార్కెట్‌కు రావటం లేదు. తాజాగా ఏర్పాటుచేసిన తాత్కాలిక మార్కెట్‌తో కొంతమేర ఉపశమనం కలుగుతున్నా.. పంటకు ఆశించినంత లాభం రావటం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు.

లాక్‌డౌన్‌తో చిక్కుల్లో పడ్డ ఉద్యానవన పంటలు
లాక్‌డౌన్‌తో చిక్కుల్లో పడ్డ ఉద్యాన పంటల రైతులు
ఇదీ చూడండి: