విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభను కనబరిచి రాష్ట్రస్థాయి అవార్డు పొందిన అనంతపురం జిల్లా కదిరి గ్రామీణ సీఐ మధును స్థానికులు సత్కరించారు. గాండ్లపెంట ఎస్సై గురు ప్రసాద్ రెడ్డి , సిబ్బంది, స్థానికులు సన్మానించారు.
భవిష్యత్తులో మరిన్ని అవార్డులు పొందాలని ఆకాంక్షించారు. కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా వినాయకుడి మంటపాలను ఏర్పాటు చేయవద్దని, ఊరేగింపులు నిర్వహించవద్దని స్థానికులకు సీఐ సూచించారు.