ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఉరవకొండలో 'యోధులకు వందనం' కార్యక్రమం - honor to corona warriors in uravakonda news

అనంతపురం జిల్లా ఉరవకొండలో యోధులకు వందనం కార్యక్రమం నిర్వహించారు. కరోనా సమయంలో సేవలందించిన యోధులకు సన్మానం చేసి ప్రశంసాపత్రం అందజేశారు.

honor to corona warriors
ఉరవకొండలో 'యోధులకు వందనం' కార్యక్రమం

By

Published : Nov 13, 2020, 7:05 PM IST

కరోనా సమయంలో నిస్వార్థ సేవలందించిన వారికి 'యోధులకు వందనం' పేరుతో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. అనంతపురం జిల్లా ఉరవకొండలో జరిగిన ఈ కార్యక్రమంలో తహసీల్దార్, ఇంఛార్జ్ ఎంపీడీఓ, సీఐ తదితరులు పాల్గొన్నారు.

కరోనా సమయంలో కీలక సేవలు అందించిన రెవెన్యూ, వైద్య, పారిశుద్ధ్య, పోలీసు, గ్రామ, వార్డు వాలంటీర్లు, సచివాలయ శాఖల నుంచి 5గురు చొప్పున ఎంపిక చేసి వారికి సన్మానం చేశారు. ప్రశంసాపత్రం అందజేశారు. అంతకుముందు కరోనాతో మరణించిన వారి ఆత్మ శాంతి కోసం 2 నిమిషాలు మౌనం పాటించారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details