కరోనా పట్టణాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోనూ విస్తరించిందని కాంగ్రెస్ సీనియర్ నేత రఘువీరారెడ్డి పేర్కొన్నారు. దీని బారిన పడినవారు అధికంగా ఉన్నారని వివరించారు. ఈ నేపథ్యంలో ఎస్.ఎస్.యోగా శిక్షణ వారు గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు రోగ నిరోధక శక్తి పెంచేందుకు హోమియో మందులను పంపిణీ చేస్తున్నారని చెప్పారు. వారికి కృతజ్ఞతలు తెలిపారు. సమాజానికి మేలు చేసే ఇలాంటి మరెన్నో కార్యక్రమాలు చేపట్టాలని ఈ సందర్భంగా రఘువీరా ఆకాంక్షించారు.
హోమియో మందులు పంపిణీ చేసిన రఘువీరా - raghuveera reddy latest news
అనంతపురం జిల్లా మడకశిర మండలం నీలకంఠాపురం గ్రామంలో సిద్ధ సమాధి యోగా శిక్షణ వారి ఆధ్వర్యంలో... ఏపీసీసీ మాజీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి చేతులమీదుగా హోమియోపతి మందులను పంపిణీ చేశారు.
మందులు పంపిణీ చేస్తున్న రఘువీరా