ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పోలీసుల సేవలు భేష్‌: మంత్రి తానేటి వనిత

నేర పరిశోధన వేగవంతం చేసి బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చర్యలకు ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబ్‌ తోడ్పతుందని రాష్ట్ర హోంశాఖ మంత్రి తానేటి వనిత అన్నారు. పోలీసుశాఖలో ప్రతి ఒక్కరూ నిబద్ధత, అంకితభావంతో పని చేస్తున్నారని ఆమె తెలిపారు. అనంతపురం పోలీసు శిక్షణ కేంద్రం ఆవరణలో ప్రాంతీయ ఫోరెన్సిక్‌ ల్యాబోరేటరీని హోంమంత్రి వనిత, శిశు సంక్షేమశాఖ మంత్రి ఉష శ్రీచరణ్, రాష్ట్ర డీజీపీ రాజేంద్రనాథరెడ్డిలు ప్రారంభించారు.

Taneti Vanitha
మంత్రి తానేటి వనిత

By

Published : Aug 1, 2022, 8:50 AM IST

ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి సంకల్పం మేరకు పోలీసుశాఖలో ప్రతి ఒక్కరూ నిబద్ధత, అంకితభావంతో పని చేస్తున్నారని హోంశాఖ మంత్రి తానేటి వనిత పేర్కొన్నారు. అనంతపురం పోలీసు శిక్షణ కళాశాలలో ఏర్పాటు చేసిన ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబ్‌ను స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి ఉష శ్రీచరణ్‌, డీజీపీ రాజేంద్రనాథరెడ్డితో కలిసి ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో తానేటి వనిత మాట్లాడారు. ప్రజలకు సత్వర న్యాయం అందించే దిశగా ‘జీరో’ ఎఫ్‌ఐఆర్‌ తీసుకొచ్చామని తెలిపారు.

రాష్ట్రంలో 13వేల ఫోరెన్సిక్‌ నమూనాలను విశ్లేషించి, నివేదికలను సంబంధిత స్టేషన్లకు పంపేలా ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబ్‌లను అందుబాటులోకి తెచ్చామని డీజీపీ పేర్కొన్నారు. ఇలాంటి ల్యాబ్‌లు 6 అందుబాటులో ఉన్నాయని, రాష్ట్ర రాజధానిలో అన్ని హంగులతో నిర్మిస్తున్నామని వెల్లడించారు. రాజమండ్రిలో త్వరలో ప్రయోగశాలను ప్రారంభిస్తున్నామని చెప్పారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details