రెండు రోజులుగా తుంగభద్ర జలాశయం నుంచి టీబీహెచ్ఎల్సీలో నీటి ప్రవాహం పెరిగింది. అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలో ఈ కాలువలో నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. అయితే బొమ్మనహాళ్ మండలం కృష్ణాపురం వద్ద శనివారం హెచ్ఎల్సీ కాలువకు బుంగ పడింది. స్థానిక రైతులు, హెచ్ఎండీఏ అధికారులు యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేశారు. టీజీహెచ్ఎల్సీ కాలువ గట్లు బలహీనంగా ఉన్నందున లోతట్టు ప్రాంతాల ప్రజలు, రైతులు భయాందోళనలకు గురవుతున్నారు. కనేకల్ సమీపంలోని చిక్కనేశ్వర వడియార్ చెరువుకు బుంగ పడింది. ఫలితంగా చెరువు ఆయకట్టు కింద భూములున్న రైతులు ఆందోళనకు గురవుతున్నారు.
మరో రెండు రోజులు నీటి ప్రవాహం..
మరో రెండు రోజులపాటు తుంగభద్ర జలాశయం నుంచి ఎస్ఎల్సీకి నీటి విడుదల కొనసాగుతుంది. టీబీహెచ్ఎల్సీ కాలువ గట్లు బలహీనంగా ఉన్నందున అధికారులను అప్రమత్తం చేశాం. రంద్రం పడిన చిక్కనేశ్వర వడియార్ చెరువుకు వెంటనే మరమ్మతులు చేపడతాం. -గాధర్ రెడ్డి, హెచ్ఎల్సీ డీఈ