ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

హంద్రీనీవా కాల్వకు గండి... భారీగా నీటి వృథా - HNSS Cannel news

అనంతపురం జిల్లాలో హంద్రీనీవా కాల్వకు గండి పడి.. నీరంతా వృథాగా పోతోంది. తనకల్లు మండలంలోని సింగిరివాండ్లపల్లి, బాలసముద్రం ప్రాంతాల్లో గండి పడింది.

handriniva-canal-hole-in-tanakallu
హంద్రీనీవా కాల్వకు గండి

By

Published : Dec 22, 2020, 1:09 PM IST

అనంతపురం జిల్లా తనకల్లు మండలంలో హంద్రీనీవా సుజల స్రవంతి పుంగనూరు బ్రాంచ్ కెనాల్​కు రెండు చోట్ల గండి పడింది. చెర్లోపల్లి జలాశయం నుంచి దిగువ ప్రాంతమైన చిత్తూరు జిల్లాకు ఇటీవల అధికారులు నీటిని విడుదల చేశారు. ఫలితంగా.. కాలువలో నీటి ఉద్ధృతి ఎక్కువైంది.

తనకల్లు మండలంలోని సింగిరివాండ్ల పల్లి వద్ద రెండు రోజుల కిందట కాలువకు గండి పడగా... ఇదే మండలంలోని బాల సముద్రం వద్ద గుర్తుతెలియని వ్యక్తులు పుంగనూరు బ్రాంచ్ కెనాల్​కి గండి కొట్టారు. ఈ కారణంగా.. భారీగా కృష్ణా జలాలు వృథా అవుతున్నాయి. అధికారులు తక్షణమే చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details