ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

యధేచ్ఛగా మట్టి తరలింపు.. దెబ్బతిన్న వంతెన - హెచ్ఎల్సి జెఈ అల్తాఫ్

Soil movement stopped by HLC officials: ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా? అన్నట్లు తయారైంది అధికార వైసీపీ నేతల దాష్టీకం.. అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలో కనేకల్ మండలంలోని కలేకుర్తి గ్రామ వైసీపీ నేత మట్టి తోలకాలు వివాదాస్పదమయ్యాయి. గత ఏడాది వర్షాలకు దెబ్బ తిన్న వంతెనపై ప్రజల వాహనాలు నిలుపుదల చేయగా..వైసీపీ నేతకు చెందిన మట్టి లోడు వాహనాలు మాత్రం యధేచ్ఛగా నడుస్తున్నాయి. అయితే అధికార పార్టీకి చెందిన మరో నేత ఫిర్యాదుతో అధికారులు రంగంలోకి దిగి రాకపోకలను అడ్డుకున్నారు.

clash between two groups
clash between two groups

By

Published : Mar 8, 2023, 8:31 PM IST

Soil movement stopped by HLC officials:ఏపీలో దౌర్జన్యాలు, భూదందాలకు అంతే లేకుండాపోతోంది. అధికార పార్టీ రాష్ట్ర స్థాయి నేతలు ఇసుక మాత్రమే కాకుండా అక్రమంగా మట్టి తోలకాలలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. వైసీపీ పెద్దల అండతో రాష్ట్రంలోని జిల్లా, మండల స్థాయి నేతలు సైతం దౌర్జన్యంగా తామనుకున్నది చేస్తున్నారు. అనంతపురం జిల్లా కనేకళ్లు మండల కేంద్రం, ఉరవకొండ తాలూకా కేంద్రం మధ్య అధిక లోడు వాహనాలు నిత్యం తిరుగుతూనే ఉంటాయి. దీంతో హెచ్ఎల్సీ హగరి వంతెన దెబ్బతినే పరిస్థితి నెలకొంది. దానికితోడు వంతెనపై బస్సుల రాకపోకలకు ఇబ్బందికరంగా మారింది.

అధికారపక్షనేతల బరితెగింపు..: బస్సులను ఆపి మరీ మట్టి లోడు వాహనాలను పంపిస్తుండటం అధికారపక్షనేతల బరితెగింపునకు నిదర్శనం. బస్సుల రాకపోకలకు ఆటంకం లేకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. వంతెనపై నుంచి మట్టితో వాహనాల రాకపోకలు చేస్తూ ఒకరు, దాన్ని అడ్డుకోడానికి ప్రయత్నించినదీ మరొకరూ.. ఇరువర్గాలు అధికార వైకాపాకు చెందినవారు కావడం గమనార్హం.

వైసీపీలోనే రెండువర్గాల మధ్య వివాదం..: కలేకుర్తి గ్రామ సమీపంలోని రైతు పొలం నుంచి హెచ్ఎల్సి హగరి వంతెన మీదుగా ట్రాక్టర్లతో ఓ నాయకుడు చేపట్టిన మట్టి తరలింపు వివాదాస్పదమైంది. వైసీపీలోనే ఇరువురు మధ్య వాగ్వాదానికి జరిగిన దృశ్యాల వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి. తన వెంచర్​లో మెరక పోసేందుకు ఓ రైతు పొలం నుంచి ఒక నేత మట్టి తరలింపునకు సంబంధించిన వివరాలు చర్చనీయాంశమయ్యాయి.

బస్సులు ఆపడంతో ప్రజలకు ఇక్కట్లు..: అధికార పార్టీకి చెందిన నాయకుడు కలేకుర్తి సమీపంలోని రైతుపొలం నుంచి జెసిబితో మట్టి తవ్వి ట్రాక్టర్లతో తరలిస్తున్నారు. ఎంత అడ్డు పడుతున్నా లెక్కచేయకుండా వేదావతి హగరి, హెచ్ఎల్సి వంతెన మీదుగా కనేకల్లులోని వెంచర్​కు మట్టి తరలిస్తుండటం.. సాధారణ ప్రయాణికుల బస్సులను మాత్రం ఆపడంతో ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో అధికలోడు వాహనాలు తిరుగుతుండటంతో వంతెన దెబ్బతినే పరిస్థితి నెలకొంది.

ఆటోల్లో ప్రయాణం దూరాభారం..: బస్సుల రాకపోకలకు ఆటంకం లేకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. అదే విషయాన్ని వైసీపీలోని మరొక వర్గానికి చెందిన వ్యక్తి ఫోన్లో హెచ్ఎల్సీ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో అధికారి అక్కడికి చేరుకుని వంతెన ప్రమాదకరంగా ఉండడంతో అధికలోడు వాహనాలకు అనుమతించేది లేదని చెప్పడంతో వివాదానికి దారి చెలరేగింది. దీంతో అధికార పార్టీ నాయకుడు వంతెన వద్దకు చేరుకొని హెచ్ఎల్సీ అధికారిని బెదిరింపులకు గురి చేశాడు. తమ ట్రాక్టర్లను నిలిపివేసే అధికారం మీకెవరిచ్చారని నిలదీయడంతో ఇరువురి మధ్యా తీవ్ర వాగ్వాదం జరిగింది.

మట్టి ట్రాక్టర్లను అడ్డుకున్న హెచ్ఎల్సీ జేఈ..: హెచ్ఎల్సీ జేఈ అక్కడికి చేరుకుని అధికారపక్షనేత దూకుడుకు బెదరక ట్రాక్టర్లను అడ్డుకునే ప్రయత్నం చేశారు. సిబ్బందిని పంపి జెసిబి సాయంతో మాల్యం గ్రామం వైపు నుంచి వంతెనపై రాకపోకలు వీలు లేకుండా గుంత తవ్వించారు. డానికితోడు కంపవేసి దారి మూసేయడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. దీంతో స్థానిక ప్రయాణికులతో కూడిన చిన్న ఆటోలు తదితర వాహనాలు కలేకుర్తి వైపు ఉన్న ఇరుకైన వంతెనపై రాకపోకలు సాగిస్తున్నాయి.

ప్రజల వినతుల మేరకే..: ఈ విషయమై హెచ్ఎల్సీ జెఈ అల్తాఫ్​ను వివరణ కోరగా అధిక లోడు వాహనాలు నియంత్రించేలా చర్యలు తీసుకోవాలని పలు గ్రామాల వారు విన్నవించిన మేరకు చర్యలు తీసుకున్నామన్నారు. ఈ క్రమంలో వంతెనపై మట్టి లోడు వాహనాలు తిరగకుండా కట్టడి చేసేలా చర్యలు చేపట్టినట్లు హెచ్ఎల్సీ జెఈ పేర్కొన్నారు.

ప్రజల కోసం ప్రాకులాడే నేత ఏడీ?..: వంతెనపై నుంచీ మట్టితో వాహనాల రాకపోకలు చేస్తూ ఒకరు, దాన్ని అడ్డుకోడానికి ప్రయత్నించినదీ మరొకరూ.. ఇరువర్గాల వారు అధికార వైకాపాకు చెందినవారు కావడం గమనార్హం. అయితే హెచ్ఎల్సీ వంతెనపై బస్సుల రాకపోకలను పునరుద్ధరించి ప్రజల సౌకర్యార్థం పట్టుబట్టి సాధిద్దామన్న ధ్యాస వైసీపీ నేతల్లో కలగకపోయడం దురదృష్టకరం.

ABOUT THE AUTHOR

...view details