అనంతపురం జిల్లా గాండ్లపెంట మండలం చెరువు ముందర తండాలోని మారమ్మ గుడిలో హుండీ చోరీకి గురైంది. గ్రామానికి సమీపంలోని మారమ్మ గుడిలో తలుపులు పగలగొట్టిన దుండగులు హుండీని అపహరించుకు వెళ్లారు. గుర్తించిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కదిరి గ్రామీణ సీఐ మధు, ఎస్సై గురు ప్రసాద్ రెడ్డి చెరువు ముందర తాండాకు వెళ్లి గుడిని పరిశీలించారు. గ్రామస్థుల ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ మధు తెలిపారు.
చెరువు ముందర తండా మారమ్మ ఆలయంలో హుండీ చోరీ.. - మారమ్మ గుడిలో హుండీ చోరీ తాజా వార్తలు
అనంతపురం జిల్లా గాండ్లపెంట మండలం చెరువు ముందర తండాలోని మారమ్మ గుడిలో గుర్తుతెలియని దుండగులు హుండీ చోరీ చేశారు. గుడిలో తలుపులు పగలగొట్టిన దొంగలు.. హుండీని అపహరించుకు వెళ్లారు. గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో.. కదిరి గ్రామీణ సీఐ మధు, ఎస్సై గురు ప్రసాద్ రెడ్డి ఆలయ పరిసరాలను పరిశీలించారు.
చెరువు ముందర తండా మారమ్మ ఆలయంలో హుండీ చోరీ