ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కరోనాపై అవగాహన... హిందూపురం పోలీసుల వినూత్న ప్రయత్నం - కరోనాపై హిందూపురం పోలీసుల అవగాహన

అనంతపురం జిల్లా హిందూపురం పోలీసులు.. ప్రజలకు కరోనాపై వినూత్నంగా అవగాహన కల్పించారు. యముడు, భటుడి వేషధారణలతో.. పౌరాణిక నాటకం ప్రదర్శించి.. కరోనా నుంచి తప్పించుకోవడానికి మాస్కు తప్పకుండా వినియోగించాలని సూచించారు.

hindupuram police awareness on mask wearing
హిందూపురం పోలీసుల వినూత్న అవగాహన

By

Published : May 4, 2021, 8:31 PM IST

అవగాహన కల్పిస్తున్న పౌరాణిక వేషధారులు

మాస్కు ధరించకపోతే వచ్చే అనర్థాల గురించి.. అనంతపురం జిల్లా హిందూపురం పోలీసులు ప్రజలకు వినూత్న రీతిలో అవగాహన కల్పించారు. యోగి నారాయణ సేవా సమితి సహకారంతో.. యముడు, భటుడి వేషధారణ ద్వారా ఈ కార్యక్రమం చేపట్టారు. మాస్కు ఉపయోగం గురించి ప్రజలకు కళ్లకు కట్టినట్లు తెలియజేయాలనే.. పౌరాణిక నాటకంతో అవగాహన కల్పిస్తున్నామన్నారు.

ఇదీ చదవండి:అడ్రస్​ మారిన మృతదేహం- అంత్యక్రియలయ్యాక వెలుగులోకి..

మాస్కు ధారణ, భౌతిక దూరం పాటించకపోవడంపై.. కరోనా బారినపడి పలువురు మృత్యువాత పడుతున్నారని తెలియజేసేందుకు ప్రయత్నించామని ఒకటో పట్టణ ఎస్సై అబ్దుల్ కరీం పేర్కొన్నారు. మాస్కు ధరించని వారికి పట్టే గతిపై చేసిన పౌరాణిక నాటకం ప్రజలను ఆకర్షించిందని చెప్పారు. వేషధారణలో ఉన్న కళాకారులు పట్టణమంతా తిరిగి మాస్కు ధరించాలని సూచించినట్లు వెల్లడించారు.

ఇదీ చదవండి:

జీవితంపై నిరాశతో వ్యక్తి ఆత్మహత్య..

ABOUT THE AUTHOR

...view details