ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

హిందూపురం మున్సిపల్ ఛైర్​పర్సన్​​గా ఇంద్రజ - hindupuram municipality latest news

అనంతపురం జిల్లా హిందూపురం మున్సిపల్ ఛైర్​పర్సన్​​గా ఇంద్రజ ఎన్నికయ్యారు. వైస్ ఛైర్మన్​గా జాబివుల్లాను ఎన్నుకున్నారు. నూతనంగా ఎన్నికైన పాలక వర్గానికి ఎంపీ గోరంట్ల మాధవ్, అధికారులు అభినందనలు తెలియజేశారు.

hindupuram municipality
హిందూపురం మున్సిపల్ ఛైర్​పర్సన్​​గా ఇంద్రజ

By

Published : Mar 18, 2021, 8:17 PM IST

అనంతపురం జిల్లా హిందూపురం మున్సిపల్ ఛైర్​పర్సన్​​గా 19వ వార్డు కౌన్సిలర్​ ఇంద్రజ, వైస్ ఛైర్మన్​గా జాబివుల్లా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తొలుత నూతనంగా ఎన్నికైన కౌన్సలర్లతో జాయింట్ కలెక్టర్ నిశాంత్ కుమార్ ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం ఛైర్​పర్సన్​, వైస్​ ఛైర్మన్​లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎన్నికైన పాలక వర్గానికి స్థానికి ఎంపీ గోరంట్ల మాధవ్, అధికారులు అభినందనలు తెలియజేశారు.

తనపై నమ్మకంతో ఛైర్​పర్సన్​గా ఎంపిక చేసినందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఇంద్రజ కృతజ్ఞతలు తెలిపారు. హిందూపురం మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషిచేస్తానని ఆమె తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details