ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మంత్రి కొడాలిపై హిందూ ధార్మిక సంఘాలు భగ్గు - kodali nani vs hindu leaders latest news

మంత్రి కొడాలి హిందూ దేవుళ్లపై చేసిన వ్యాఖ్యలపై.. హిందూ దేవాలయాల పరిరక్షణ సమితి నాయకులు భగ్గుమన్నారు. కొడాలి నానిని అరెస్టు చేయాలని పలు పోలీస్ స్టేషన్లలలో ఫిర్యాదు చేశారు. మంత్రి హిందువులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

hindu leaders agitation on minister kodali nani
మంత్రి కొడాలిపై హిందువుల ఫిర్యాదు

By

Published : Sep 22, 2020, 4:00 PM IST

కర్నూలు జిల్లాలో..

మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలకు నిరసనగా.. నంద్యాలలో హిందూ దేవాలయాల పరిరక్షణ సమితి నాయకులు ధర్నా చేశారు. హిందూ దేవుళ్లను కించపరిచేలా మాట్లాడిన మంత్రిపై చర్యలు తీసుకోవాలని.. ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్ సీఐ సోమశేఖర్ రెడ్డికి ఫిర్యాదు చేశారు.

అనంతపురం జిల్లాలో..

మంత్రి కొడాలి నాని హందూ దేవాలయాలపై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా.. హిందూపురం విశ్వహిందూ పరిషత్, హిందూ సురక్ష సేవ సమితి ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. పట్టణంలో ద్విచక్ర వాహనాలతో ర్యాలీ నిర్వహించి.. ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్​లో మంత్రిపై ఫిర్యాదు చేశారు. కొడాలి నానిని వెంటనే మంత్రి పదవి నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. మంత్రిపై తక్షణమే చర్యలు తీసుకోకపోతే ఆందోళనలు మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

మంత్రి కొడాలి నానిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ.. ఉరవకొండ పోలీస్ స్టేషన్​లో భాజపా నాయకులు ఫిర్యాదు చేశారు. మంత్రి పదవిలో ఉండి, హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా మాట్లాడారని భాజపా రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు వెంకటప్ప ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రికి రాబోయే ఎన్నికల్లో ప్రజలే గట్టిగా బుద్ధి చెప్తారని వెంకటప్ప అన్నారు.

ఇదీ చదవండి:ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్ లిమిటెడ్ లో.. ఎన్జీటీ బృందం తనిఖీ

ABOUT THE AUTHOR

...view details